VZM: మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ కూటమి ప్రభుత్వానికి తగదని ఎమ్మెల్సీ పీవీ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే అప్పల నరసయ్య అన్నారు. గజపతినగరం వైసీపీ కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద విద్యార్థులు ఖరీదైన వైద్య విద్యను అభ్యసించేందుకు జగన్ మెడికల్ కళాశాలలను నిర్మించారన్నారు.