కృష్ణా: పెదపారుపూడి నుంచి భూషణగుళ్ళ ప్రధాన రహదారి శనివారం పూర్తిగా దెబ్బతింది. సుమారు రెండు కిలోమీటర్ల మేర రహదారిపై లోతైన గుంతలు ఏర్పడి వాహనదారులు, పాఠశాల విద్యార్థులు,వృద్ధులు,గ్రామ ప్రజలు ప్రతిరోజూ తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల వర్షాల కారణంగా గుంతలు మరింత లోతుగా మారాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.