GDWL: సమాచారహక్కు చట్టం ప్రభుత్వ అధికారుల పనితీరులో పారదర్శకత, జవాబుదారి తనాన్ని పెంపొందించే లక్ష్యంతో రూపొందించడం జరిగిందని, ఈచట్టంపై ప్రతిఒక్కరికి అవగాహన అవసరమని కలెక్టర్ బీఎం.సంతోష్ అన్నారు. అక్టోబర్ 5 నుంచి 12 వరకు ఆర్టీఐ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కలక్టరేట్లో అధికారులకు చట్టంపై అవగాహన సమావేశం నిర్వహించారు.