NZB: సాలూర మండలంలోని ఖాజాపూర్ వాగుపై గల వంతెన రైలింగ్ దెబ్బతినడంతో ప్రమాదకరంగా మారింది. ప్రయాణికులు ఏమాత్రం ఏమరుపాటుగా వాహనాలు నడిపినా ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని వాహనదారులు భయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి, ఎలాంటి ప్రమాదం జరగకముందే దెబ్బతిన్న రైలింగ్‌ను పునర్నిర్మించాలని గ్రామస్థులు, ప్రయాణికులు కోరుతున్నారు.