మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. ENG నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో నాట్ స్కైవర్ బ్రంట్ అద్భుత సెంచరీ(117)తో జట్టును ఆదుకుంది. శ్రీలంక బౌలర్లలో రణవీర 3 వికెట్లు తీయగా, సుగంధిక, ఉదేశిక తలో 2 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను కట్టడి చేశారు.