NLG: బీసీలకు రిజర్వేషన్లను కల్పించిన తర్వాతే ఎన్నికల నిర్వహించాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఐతగూడ జనార్దన్ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో గల అమరవీరుల స్థూపం వద్ద ఈ నెల 14న జరిగే ‘రాష్ట్ర వ్యాప్త బంద్’ ను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు.