మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా టీమిండియా తన తదుపరి మ్యాచ్‌లో పటిష్ట ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది. విశాఖపట్నం వేదికగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. గత మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓడిన భారత్.. గ్రూప్ టాపర్ ఆస్ట్రేలియాను ఓడించి తిరిగి విన్నింగ్ ట్రాక్‌లోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది.