VSP: సమాజ అభివృద్ధికి పౌర హక్కులతో పాటు పౌర విధులు అత్యంత ముఖ్యమని ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే స్పష్టం చేశారు. శనివారం విశాఖ ఎంవీపీలా కళాశాలలో జరిగిన ఆర్ఎస్ఎస్ విశాఖ మహానగర విజయదశమి ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. దేశ పౌరులు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తేనే ప్రగతి సాధ్యమన్నారు.