MBNR: జిల్లా కేంద్రంలో జర్నలిస్టుగా పనిచేస్తున్న శామ్యూల్ సుందర్ కూతురు ప్రియా ఏంజెల్ వనపర్తి మెడికల్ కళాశాలలో మెడిసిన్ సీట్ సాధించింది. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇబ్బందికరంగా మారింది. జర్నలిస్టుల ద్వారా సమాచారం అందుకున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విద్యార్థినికి 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని క్యాంపు కార్యాలయంలో శనివారం అందించారు.