BHNG: న్యాయవాదులు నైతిక విలువలు పాటించాలని,కోర్టులు కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలని హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ కోరారు. శనివారం జిల్లా కోర్టు నూతన భవన నిర్మాణ శంకుస్థాపనకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై శిలాపలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన భవనాన్ని కాల పరిమితిలో పూర్తి చేయాలని ఆకాంక్షించారు.