KMM: తిరుమలాయపాలెం మండలం పడమటితండాకు చెందిన రైతు భూక్య భద్రు (కోటి) శనివారం తన వ్యవసాయ క్షేత్రంలోని బావిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. పనులు చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.