BDK: సుమారు ఒక కోటి పదకొండు లక్షల రూపాయల విలువ గల 222 కిలోల ప్రభుత్వ నిషేదిత గంజాయిని శనివారం టాస్క్ ఫోర్స్, అశ్వారావుపేట పోలీసులు పట్టుకున్నారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వాహనాన్ని చాకచక్యంగా పట్టుకున్న అశ్వారావుపేట పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.