US రాయబారి సెర్గియో గోర్ PM మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీ గురించి మోదీ ప్రస్తావిస్తూ.. తన పదవీ కాలంలో భారత్-అమెరికా భాగస్వామ్యాన్ని గోర్ బలోపేతం చేస్తారని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ప్రధానితో తన భేటీ అద్భుతంగా జరిగిందని.. రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, కీలక ఖనిజాల గురించి చర్చించినట్లు గోర్ పేర్కొన్నారు. మోదీని ట్రంప్ స్నేహితుడిగా భావిస్తారని తెలిపారు.