జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో ముస్లిం నూర్ భాష వెల్ఫేర్ సొసైటీ సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎండి అబ్దుల్ రజాక్ అధ్యక్షుడిగా, ఎండి సుల్తాన్ ఉపాధ్యక్షుడిగా, ఎండి అమీర్ క్యాషియర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సభ్యులు సొసైటీ అభివృద్ధికి కృషి చేయాలని నిర్ణయించారు. గ్రామస్థులు, మత పెద్దలు పాల్గొన్నారు.