AP: రాష్ట్రంలో కల్తీ మద్యం గుర్తించేందుకు APATS పేరుతో ఓ ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ యాప్ ద్వారా మద్యం బాటిల్ లేబుల్‌ను స్కాన్ చేస్తే చాలు.. ఆ మద్యం ఎప్పుడు తయారైంది, దాని నాణ్యత ప్రమాణాలు, గడువు తేదీ తదితర కీలక సమాచారం మొత్తం క్షణాల్లో కనిపిస్తుందని ఆయన వెల్లడించారు.