KNR: నగరంలోని ప్రెస్ క్లబ్లో ‘కిసాన్ గ్రామీణ మేళా-2025’ పోస్టర్, బ్రోచర్లు విడుదల చేశారు. డిసెంబర్ 1–3 న మేళా జరగనుంది. రైతు సంక్షేమం, గ్రామీణ అభివృద్ధిపై దృష్టి సారించే ఈ కార్యక్రమం రైతుల సమస్యల చర్చకు వేదికగా నిలుస్తుందని కిసాన్ జాగరణ్ అధ్యక్షుడు పి. సుగుణాకర్ రావు తెలిపారు. కొత్త మార్గాలు రూపొందించేందుకు మేళా దోహదపడుతుందని అన్నారు.