TPT: వడమాలపేట మండలం కాయంపేట పీఏసీఎస్ కార్యాలయంలో శనివారం ప్రధానమంత్రి ధన్-ధాన్య యోజన పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా DCC అధ్యక్షులు అమాస రాజశేఖర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా రైతులు విన్నారు. అనంతరం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని రాజశేఖర్ రెడ్డి తెలిపారు.