ప్రకాశం: గిద్దలూరు మండలం గడికోట గ్రామంలో ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. మృతుడు షేక్ హుస్సేన్‌గా పోలీసులు తెలిపారు. గేదెలను మేపేందుకు వెళ్లిన క్రమంలో కాళ్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు నీటి కుంట వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందాడు. ఈ ఘటన పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.