PDPL: ముత్తారం మండలం ఖమ్మంపల్లిలో అక్రమాలు జరిగాయని గ్రామస్తుడు పర్శ ఓదెలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో డీఎల్పీవో వేణుగోపాల్ విచారణ చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి, రికార్డులను స్వాధీనం చేసుకొని, జిల్లా పంచాయతీ కార్యాలయాన్ని తరలించారు. విచారణ తదుపరి కలెక్టర్కు నివేదిక అందిస్తామని చెప్పారు.