చైనాపై 100% సుంకాన్ని విధిస్తూ US అధ్యక్షుడు ట్రంప్ హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారు. NOV 1 తర్వాత చైనా నుంచి వచ్చే అన్ని వస్తువులపై ఈ సుంకం అమలు కానుంది. సెమీ కండక్టర్లు, ఫైటర్ జెట్లలో వాడే రేర్-ఎర్త్ ఖనిజాలపై చైనా కొత్త నియంత్రణలు తీసుకురావడంతో ట్రంప్ ఈ చర్య తీసుకున్నారు. చైనా అదనపు చర్యలు తీసుకుంటే మరిన్ని సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.