NLG: ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం దేవరకొండలోని అయ్యప్పస్వామి సేవా సదన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని అయన తెలిపారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్ ఉన్నారు.