MNCL: బెల్లంపల్లి పట్టణంలోని కాసిపేట గురుకుల విద్యార్థులు SGFI అథ్లెటిక్స్ పోటీలలో 12పథకాలు సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ సంతోష్ కుమార్ తెలిపారు. శనివారం క్రీడాకారులను ప్రిన్సిపల్ అభినందించారు. విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడలలో రాణించడం ద్వారా ఉద్యోగ అవకాశాలలో ముందుంటారన్నారు.