SKLM: పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శనివారం కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై కొలువున్న శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి,అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.