KNR: రామడుగు మండలంలోనిమోడల్ స్కూల్ విద్యార్థులు జిల్లాస్థాయి జానపద నృత్య పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతి సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎస్వీఆర్టీ ఆధ్వర్యంలో కళాభారతిలో ఈ పోటీలు జరిగాయి. విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించిన గైడ్ ఉపాధ్యాయుడు రత్నాకర్ కృషిని పాఠశాల ప్రిన్సిపల్ ఆడెపు మనోజ్ కుమార్ ప్రశంసించారు.