హీరో రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన ప్రధాని మోదీని కలిశారు. తాను బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన తొలి ఆర్చరీ ప్రీమియర్ లీగ్(APL) విజయవంతమైన సందర్భంగా ప్రధానిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. విలువిద్యకు భారత సాంస్కృతికి ఉన్న సంబంధాలను ప్రధానికి ఆయన వివరించారు. ఆర్చరీ వారసత్వాన్ని నిలుపుకోవడానికి ప్రధాని మార్గదర్శకత్వం తమకెంతో ఉపయోగపడ్డాయని రామ్ చరణ్ చెప్పారు.