ADB: భీంపూర్ మండలంలోని పిప్పల్ కోటి గ్రామంలో బతుకమ్మ నిమజ్జన వేడుకలను శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని బతుకమ్మలను డప్పుల చప్పుళ్లతో ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మకు ప్రత్యేక పూజలు చేసి మొక్కలు సమర్పించుకున్నారు. అనంతరం సాంస్కృతిక పాటలకు అనుగుణంగా మహిళలు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.