BDK: బూర్గంపాడు మండలం సారపాక మేడే కాలనీలో సీపీఎం పార్టీ నాయకులు శనివారం పర్యటించారు. మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రజలు రోడ్లు, డ్రైనేజీలు, మంచినీళ్లు, కరెంటు సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. గతంలో ఈ రోడ్డు గురించి నియోజవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరావుకి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు.