WNP: జిల్లాలోని గోపాల్పేట మండలం ఎదుట్ల గ్రామంలోని శనివారం వ్యవసాయ పొలంలో నీళ్లు తాగిన నెమళ్లు అస్వస్థతకు గురయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ఎస్పీ రావుల గిరిధర్, గోపాల్పేట, వనపర్తి ఎస్సైలు నరేష్, హరి ప్రసాద్, ఎస్పీపీఆర్వో రాజా గౌడ్, సిబ్బందిని అప్రమత్తం చేసి అస్వస్థతకు గురైన నెమళ్ల చికిత్స కోసం వనపర్తి పశు వైద్య ఆసుపత్రికి తరలించారు.