AP: నెల్లూరు మైపాడు గేట్ వద్ద ఏర్పాటుచేసిన స్మార్ట్ స్ట్రీట్‌ను CM చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. 30 కంటైనర్లలో 120 షాపులు ఏర్పాటుచేయగా.. వీటిని ‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రపెన్యూర్’ కింద పొదుపు సంఘాల మహిళలకు కేటాయించారు. సోలార్, CC కెమెరా, ఫ్రీ వైఫై కల్పించామని, మిగతా నగరాల్లోనూ ఇలాంటి స్ట్రీట్స్ ఏర్పాటుచేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.