ADB: సమాచార హక్కు చట్టం బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు వికాస సమితి అధ్యక్షుడు డా. యర్రమాద కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సమాచార హక్కు వికాస సమితి జిల్లాధ్యక్షుడు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్టికల్ 51(ఎ) సమాచారం పొందడం ప్రతి ఒక్కరి రాజ్యాంగబద్ధమైన హక్కు అని అన్నారు.