KMM: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చిన అనుమతిని మట్టి మాఫియా తమ జేబులు నింపుకోవడానికి వాడుకుంటోంది. కారేపల్లి మండలంలో మట్టి దందా పేట్రేగిపోతోంది. గతంలో ట్రాక్టర్లలో చేసిన రవాణా, ఇప్పుడు టిప్పర్లు, లారీలతో నిబంధనలకు విరుద్ధంగా సాగుతోంది. అక్రమ రవాణాను ప్రశ్నించిన వారిపై మాఫియా తిరగబడుతున్నట్లు సమాచారం. అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు.