పశ్చిమ బెంగాల్ CM మమతా బెనర్జీ రాష్ట్ర CEO మనోజ్ అగర్వాల్‌పై చేసిన బెదిరింపు వ్యాఖ్యలపై ఈసీ స్పందించింది. ఇటీవల ఓ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, CEO పరిమితులు దాటితే ఆయనపై ఉన్నటువంటి అవినీతి ఆరోపణలను బహిర్గతం చేస్తానని బెదిరించారు. దీంతో సీఎంపై FIR నమోదు చేయాలని BJP MLAలు లేఖ రాసిన 24 గంటల్లోనే EC అందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ను కోరింది.