సత్యసాయి: తలుపుల హైస్కూల్ ఎదురుగా గాంధీనగర్ రోడ్డు సమస్యను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పరిష్కరించారు. 30ఏళ్ల రోడ్డు సమస్యకు న్యాయపరమైన ఇబ్బందులను అధిగమించి అధికారులతో చర్చించి సీసీ రోడ్డు వేయించారు. దీంతో గాంధీనగర్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేను కలిసి సత్కరించారు. సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు.