కరీంనగర్ నుంచి శబరిమల మహా పాదయాత్ర రేపు ప్రారంభమవుతుందని ప్రముఖ గురుస్వామి గడప నాగరాజు తెలిపారు. భగత్ నగర్ హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హరిహర క్షేత్రం అయ్యప్ప దేవాలయం లో గణపతి హోమం నిర్వహించి రాజేశ్వర శర్మతో ఇరుముడి కట్టుకొని శబరిమలకు అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర బృందం బయలుదేరుతుందని తెలిపారు.