AP: ములకలచెరువు కల్తీ మద్యం కేసును పారదర్శకంగా విచారించాలని, దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టొద్దని ఎక్సైజ్ కమిషనర్‌కు మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. కల్తీ మద్యంపై సమీక్ష నిర్వహించిన మంత్రి.. ప్రతి మద్యం దుకాణంలో సోదాలు నిర్వహించాలని ఆదేశించారు. మద్యం కల్తీ జరిగినా, సహకరించినా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు.