MDK: నర్సాపూర్ మండలంలో దారి దోపిడీలకు పాల్పడిన నీలగిరి దశరథ్ (21), బుర్నోటి ఆగమయ్య(21), దన్నారం కృష్ణ (20)లను అరెస్టు చేసినట్టు ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. 7న స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ఆపి కొట్టి రూ. 350లు, కారులో గొర్రెల కాపరులకు లిఫ్ట్ ఇచ్చి రూ. 2500 నగదు, రూ. 5,500 ఫోన్ పే నుంచి బదిలీ చేయించుకున్నట్లు వివరించారు.