SRCL: ప్రజలు ఫేక్ కాల్స్‌తో జాగ్రత్తగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. సిరిసిల్లలో శనివారం ప్రకటన విడుదల చేశారు. గత రెండు రోజులుగా కొందరు ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఉద్యోగాలు ఇస్తామని ఫేక్ కాల్స్ చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి దృష్ట్యా ఎలాంటి ఉద్యోగ ప్రకటన ఇవ్వలేదన్నారు.