AP: ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ వెనక ఎవరున్నా కఠిన చర్యలు తప్పవని హోంమంత్రి అనిత స్పష్టంచేశారు. ఇప్పటికే సొంత పార్టీ నేతలను సస్పెండ్ చేశామని గుర్తుచేశారు. ఇక మచిలీపట్నంలో పేర్ని నాని పోలీస్ స్టేషన్కి వెళ్లి మరీ పోలీసులను బెదిరించడం దారుణమని, ఆయనపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు బుద్ధి చెప్పినా YCP నేతల తీరు మారలేదని విమర్శించారు.