టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన కరూర్ ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, విజయ్ బాధిత కుటుంబాలను ఈ నెల 17న కలవనున్నట్లు వర్గాలు వెల్లడించాయి. అయితే వారి ఇళ్ల వద్ద కాకుండా ప్రత్యేక వేదికపై పరామర్శించేందుకు, అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.