TG: మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడలో వ్యవసాయ బావిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఎంచగూడెం మండలానికి చెందిన ఇద్దరు చిన్నారులు బహిర్భూమి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వారు బావిలో జారిపడ్డారు. అందుబాటులో ఎవరూ లేకపోవడంతో వారు బావిలోనే ప్రాణాలు వదిలారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.