కృష్ణా: గుడివాడ మండలం బొమ్ములూరు గ్రామంలో కార్డెన్ అక్రమంగా నేల టపాసులు, ఉల్లిపాయ టపాసులు తయారు చేసే వారిపై కార్డెన్ అండ్ సెర్చ్ను పోలీసులు శనివారం నిర్వహించారు. దీనిలో నాలుగు మూటలు ఉల్లిపాయ టపాసులు, దానిని తయారు చేసేందుకు ఉపయోగించే సామాగ్రి,ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.