NRML: ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు కోరారు. బీజేపీ ఓటు దొంగతనాన్ని అడ్డుకోవాలన్న లక్ష్యంతో టీపీసీసీ ఆధ్వర్యంలో ప్రారంభమైన సంతకాల సేకరణ ప్రచారాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు డిక్లరేషన్ ను సంతకాల ద్వారా తెలియజేయడానికి క్షేత్ర స్థాయిలో ప్రజలను చైతన్యం చేయాలన్నారు.