SKLM: శ్రీకాకుళం పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ప్రపంచ ఆరోగ్య మానసిక దినోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమగ్ర శిక్ష జిల్లా ఏపీసి డాక్టర్ శశిభూషణ్ మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉండాలని సూచించారు. ప్రాథమిక విద్య నుండే విద్యార్థులు మానసిక సమతుల్యతను అలవాటు చేసుకోవాలని సూచించారు.