E.G: గోకవరంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్బంగా స్థానిక ప్రభుత్వ ఎస్. టి. గర్ల్స్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో బాలికలకు ఆరోగ్యం పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా. విఘ్నేశ్వరావు మాట్లాడుతూ.. బాలికల ఆరోగ్యం కుటుంబానికి సమాజానికి ముఖ్యమని అందుకే బాలికలకు ఆరోగ్యవంతంగా ఉండాలని అన్నారు.