NZB: మెండోరా మండలంలోని కాకతీయ కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై సుహాసిని శనివారం తెలిపారు. సుమారు 55-60 ఏళ్ల వయసు కలిగిన ఆ మహిళ లేత ఆకుపచ్చ చీర, ఎరుపు జాకెట్ ధరించి ఉంది. ఆమె ఎడమ చేతిపై పచ్చబొట్టు ఉందని ఎస్సై పేర్కొన్నారు. మృతురాలి ఆచూకీ తెలిసిన వారు ఆర్మూరు రూరల్ సీఐ (871265985) ఎస్సై (8712659864) నంబర్‌కు సంప్రదించాలన్నారు.