ప్రకాశం: సింగరాయకొండ మండలం కలికవాయిలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగిన బీకేటీ పొగాకు కంపెనీని మంత్రి స్వామి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కంపెనీలో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరమని అన్నారు. అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, బీకేటి కంపెనీకి ప్రభుత్వం తరఫున సాయం అందిస్తామని తెలిపారు.