MBNR: ఆన్లైన్లో ఉద్యోగం కోసం వెతుకుతున్న ఓ మహిళ సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోయింది. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసిన సైబర్ నేరగాళ్లు, మోసపోయినట్లు గ్రహించిన మహిళ 1930కి ఫిర్యాదు చేయడంతో మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శనివారం SI శేఖర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.