JN: పౌష్టికాహారం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని సెక్టార్ సూపర్వైజర్ సావిత్రి అన్నారు. దేవరుప్పుల మండలం కామారెడ్డి గూడెం గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. ఈ సందర్భంగా పోషణ మాసం ప్రతిజ్ఞ చేయించారు. అంగన్వాడీ కేంద్రాల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.