కోనసీమ: కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అన్న కుమారుడి వివాహం సందర్భంగా శనివారం మల్లాడి భాగ్యరాజ్ అనే వ్యక్తి బైక్పై పెళ్లి కుమార్తె ఇంటికి వెళ్తుండగా కొబ్బరికాయల లోడుతో వస్తున్న ట్రాక్టర్ వెనుకనుంచి అతనిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో భాగ్యరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పెళ్లి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.