MHBD: బీసీల మనోభావాలను కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసిందని బీజేపీ ఓబీసీ మోర్చా తొర్రూరు మండల అధ్యక్షుడు గుండా సురేష్ పేర్కొన్నారు. శనివారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సరైన ప్రణాళిక, తెలియని విధానాలతో బీసీలకు రావలసిన 42 శాతం రిజర్వేషన్లను తుంగలో తొక్కారని, బీసీల రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు.